Sundeep Kishan : టాప్ హీరో కొడుకు డైరెక్షన్ లో సందీప్ కిషన్
టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నా.. ఆ స్థాయిలో విజయాలు లేని హీరో సందీప్ కిషన్. ఈ యేడాది ఊరుపేరు భైరవకోనతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా అనే మూవీ చేస్తున్నాడు. ముందు నుంచీ తెలుగుతో పాటు తమిళ్ మూవీస్ పై అదే ఫోకస్ తో ఉన్న సందీప్ కిషన్ త్వరలోనే తమిళ్ టాప్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు అఫీషియల్ న్యూస్ ను కన్ఫార్మ్ చేస్తూ ఓ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్.
దళపతి విజయ్ కొడుకు హీరోగా రాణిస్తాడు అనే భావించారు చాలామంది. కానీ అతను డైరెక్షన్ పై ఫోకస్ చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితమే అతను దర్శకత్వం చేస్తాడు అనే న్యూస్ వచ్చింది. జాసన్ సంజయ్ దర్శకుడుగా డెబ్యూ మూవీని తామే నిర్మిస్తున్నాం అని అనౌన్స్ చేసింది లైకా ప్రొడక్షన్స్ బ్యానర్. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటించబోతున్నాడు. ఈ మేరకు ఈ ఇద్దరూ కలిసి ఉన్నట్టుగా ఉన్న ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మోషన్ పోస్టర్ లో అతని ఆర్ఆర్ హైలెట్ గా నిలవడం విశేషం.
సో.. సంజయ్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా నటించబోతున్నాడు. సందీప్ ను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసిన వారిలో లోకేష్ కనగరాజ్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. తెలుగులో మేర్లపాక గాంధీకి పేరొచ్చింది. సో.. జాసన్ సంజయ్ కూడా ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడేమో చూడాలి. ఏదేమైనా ఈ కాంబినేషన్ ఇప్పుడు తమిళ్ తో పాటు తెలుగులోనూ సంచలనంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com