Suma Kanakala: రాజీవ్‌తో పులిహోర కలిపిన సుమ..

Suma Kanakala: మైకు పట్టినా.. గరిటె పట్టినా సుమ స్టైలే వేరు.. ఎవర్ గ్రీన్ హీరోయిన్‌లా యాంకరింగ్‌లో కూడా ఆమే నెంబర్ వన్.. మూడు తరాల ప్రేక్షకులు ఆమె అభిమానులంటే అతిశయోక్తి కాదు. యాంకరింగ్ చేసినా వంట చేసినా అదే ఎనర్జీ. దాదాపు సినిమా ప్రివ్యూ రిలీజ్ ఈవెంట్లన్నింటికీ సుమ వైపే చూస్తుంటారు దర్శక నిర్మాతలు..
ఇక కొత్త హీరో హీరోయిన్లతో ఇంటర్వ్యూలు సరే సరి.. బుల్లితెరపై షోలు.. ఇన్ని చేస్తున్నా ఎంత ఖాళీనో అన్నట్లు యూట్యూబ్‌లో సుమ పేరుతో ఏదో ఒక ప్రోగ్రామ్. ఎంటర్‌టైన్ చేయడంలో సుమ నెంబర్ వన్.. మా ఆయన కోసం నేను చేసిన పులిహోర అంటూ.. ఆమె అత్తగారు నేర్పిన పులిహోరను అవలీలగా చేసేసింది..
ఆరుగజాల పట్టు చీరకట్టి అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా గరిటె పట్టి వంటింటి మహరాణిలా ఘుమఘుమలాడే పులిహోర తయారు చేసింది.. టేస్ట్ చేయమంటూ భర్త రాజీవ్‌కి పులిహోరని కొసరి కొసరి వడ్డించింది.. దగ్గరుండి ప్రేమగా అడిగింది ఎలా ఉందో చెప్పమని.. భార్య ఏం చేసినా బావుందని చెప్పే రాజీవ్.. అమ్మని మరిపించిందన్నట్లుగా నూటికి తొంభై మార్కులు ఇచ్చేశాడు సుమ చేసిన పులిహోరకి.
ఆమె ఇచ్చిన మెజర్స్‌తో ప్రేక్షకులు కూడా పులిహోర చేయడానికి రెడీ అయిపోతున్నారు. పులిహోర వీడియో చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్.. స్టార్ హీరో నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్కూడా ఇన్ని వ్యూస్ ఉంటాయో లేదో కానీ సుమక్క అంటే అద్దీ మరి. సుమలో అందరికీ నచ్చే బెస్ట్ క్వాలిటీ అతి ఉండదు, ఓవర్ యాక్షన్ అసలే ఉండదు. అందుకే సుమ అందరికీ నచ్చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com