Ma Oori Polimera 2 : కవిత ఎట్లా బతికచ్చిందో అప్పుడే తెలుస్తుందట

సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'మా ఊరి పొలిమేర 2' మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా ఇప్పుడొస్తున్న సీక్వెల్ మాత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. నవంబర్ 2న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చేతబడులు, క్షుద్రపూజలకు మర్డర్ మిస్టరీ అంశాలను జోడిస్తూ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ మూవీని తెరకెక్కిస్తోన్నారు. బుధవారం 'మా ఊరి పొలిమేర 2' సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్‌కు మించిన థ్రిల్లింగ్‌గా 'మా ఊరి పొలిమేర 2' ఉంటుందని దర్శకుడు పేర్కొన్నాడు.
ఇక 'మా ఊరి పొలిమేర' పార్ట్ 1లో చేతబడులు చేసే ఆటోడ్రైవర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో సత్యం రాజేష్ నటించారు. ప్రపంచానికి తెలియకుండా అన్న చేసే క్షుద్రపూజల మిస్టరీని రివీల్ చేసే కానిస్టేబుల్ గా బాలాదిత్య కనిపించాడు. సీక్వెల్ లో సత్యం రాజేష్, బాలాదిత్య క్యారెక్టర్స్ మరింత ఇంటెన్స్‌గా ఉంటాయని సమాచారం. మా ఊరి పొలిమేర 2 షూటింగ్‌ను పాడేరుతో పాటు ఉత్తరాఖండ్, కేరళలో జరిపినట్లు నిర్మాతలు తెలిపారు. ఇటీవల వరుణ్‌తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోన్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా 'మా ఊరి పొలిమేర 2'లో రాకేందు మౌళి, సాహితి దాసరి, అక్షత శ్రీనివాస్ ఇతర ముఖ్య పాత్రలను పోషించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com