Youtube Channels : 18 యూట్యూబ్ చానెల్స్ ను రద్దు చేయించాం : మా

Youtube Channels : 18 యూట్యూబ్ చానెల్స్ ను రద్దు చేయించాం : మా
X

సినీ నటులు, వారి ఫ్యామిలీలను టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేయడం, ట్రోలింగ్‌, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న 18 యూట్యూబ్ చానెల్స్ ను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తెలిపింది. ‘బ్రహ్మి ట్రోల్స్‌ 3.0’, ‘టీకే క్రియేషన్స్‌’, ‘డాక్టర్ ట్రోల్స్‌’, ‘ట్రోలింగ్‌ పోరడు’, ‘అప్‌డేట్‌ ట్రోల్స్‌’ లాంటితో పాటు 13 చానెల్స్ ను రద్దు చేశామని పేర్కొంది. హీరో, హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ట్రోలింగ్‌ వీడియోలను డిలీట్‌ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే దాదాపు ఐదు యూట్యూబ్‌ చానెల్స్ మొదట రద్దు చేయించారు.

Tags

Next Story