Maa Elections 2021 First Result: ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో ఇద్దరు ఈసీ మెంబర్లు గెలుపు..

Maa Elections 2021 First Result : మా ఎన్నికల్లో తొలి ఫలితం అతి త్వరలో రానుంది.. ముందుగా ఈసీ మెంబర్ల ఫలితాలను ప్రకటించారు. వీరిలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసిన ఇద్దరు ఈసీ మెంబర్లు గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వారిద్దరిలో ఒకరు శివారెడ్డి కాగా.. మరొకరు కౌశిక్. దీంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆనందోత్సాహాలతో ఉంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మంచు విష్ణు ప్యానల్ ముందంజలో ఉండేసరికీ.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ కొంత నిరుత్సాహానికి గురైంది. దీంతో ఫలితం ఎలా ఉంటుందా అని టెన్షన్ పడ్డారు. కానీ ఈసీ మెంబర్ల ఫలితాలు ప్రకటించారు.. అందులో తొలి ఫలితం వచ్చింది.. దానిలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలుపొందడంతో.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ కూడా ఆనందంతో ఉంది.
మా ఎన్నికల్లో మొత్తం 905 ఓట్లకు గాను.. 883 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వీరిలో 605 మంది నేరుగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేశారు. మరో 60 మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. సో మొత్తం 665 ఓట్లు పోలైనట్లు లెక్క. వీటిలో 50 ఓట్లు చెల్లనివిగా అధికారులు పరిగణించారు. సో.. ఫైనల్ గా 615 ఓట్లు పోలైనట్టుగా తేల్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com