MAA Elections: 'మా' అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమశిక్షణ సంఘం స్పష్టం చేసింది. మా అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు ఎంతో ఉత్కాంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆన్‌లైన్ వేదికగా 'మా' సర్వసభ్య భేటీ జరిగింది. 'మా' నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని సినీ నటుడు, 'మా' అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్‌రాజ్ సూచించారు.
అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఎన్నికలు నిర్వహించడానికి కొంత సమయం అవసరమని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. అక్టోబరు రెండో వారం మధ్యలో ఏ తేదీ అనువుగా ఉంటే అప్పుడు నిర్వహిస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేష్ వెల్లడించనున్నారు.
మా అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, హేమలు ఉన్నారు. ఎన్నికల తేదీ వెలువడటంతో అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్యానెల్ సభ్యులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఎన్నికలకు మరో నెల గడువు ఉండటంతో చివరి వరకూ ఎవరు పోటీలో ఉంటారు? ఎవరు విజయం సాధిస్తారు? అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సారి 'మా' కొత్త భవనం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com