MAA Elections 2021: కావాలంటే పవన్‌ని అడగండి.. వాళ్లిద్దరి మధ్య ఏ ఈగో ప్రాబ్లమ్స్ లేవు.. : మంచు విష్ణు

MAA Elections 2021: ఈసారి మా ఎలక్షన్లు జనరల్ ఎలక్షన్లను తలపిస్తున్నాయి. బరిలోకి దిగిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌లు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. కొన్ని గంటల్లో జరగబోయే ఎన్నికలు రంగం సిద్దం చేసుకున్న మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ప్రతిసారి మీ నాన్న పేరుని ఎందుకు ప్రస్తావిస్తారని అందరూ నన్ను అడుగుతున్నారు.
నిజం చెప్పాలంటే ఆ ప్రశ్న పవన్‌నే అడగడం బెటర్. నాన్నకి, పవన్‌కి మధ్య ఏ గొడవలూ లేవు. ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ లేవు. ఆయన హీరోగా నటించిన వకీల్‌సాబ్ సినిమా మానాన్నకు బాగా నచ్చింది. వెంటనే పవన్‌కి ఫోన్ చేసి.. సినిమా చాలా బాగుందని చెప్పారు.
బాగా యాక్ట్ చేశావంటూ పవన్‌ని ప్రశంసించారు. దానికి పవన్.. థ్యాంక్యూ అండి.. మీలాంటి పెద్ద నటులు ఫోన్ చేసి మెచ్చుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అయితే ఇటీవల విడుదలైన 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ మానాన్నని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు వేశారు.. త్వరలో ఆయన వాటికి సమాధానాలు చెబుతారు అని విష్ణు అన్నారు.
ఇకపోతే మాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదని విమర్శలు చేస్తున్నారు. కానీ అవన్నీ నిజం కాదు.. మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మంచి స్నేహం ఉంది. వాళ్లంతా మాకు మద్దతు ఇస్తున్నారు అని మంచు విష్ణు అంటున్నారు. బన్నీ, చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్, చరణ్, మనోజ్, మా అక్క లక్ష్మి తరచూ కలుస్తుంటారు. నేను, బన్నీ ఎక్కువగా మెసేజ్‌లు చేసుకుంటాము. మెగా హీరోస్‌తో మా అనుబంధం ఇప్పటిది కాదు. వాళ్లందరూ నన్ను గెలిపించమని ప్రచారం చేస్తున్నారు. అందరికీ ఫోన్లు చేసి చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com