Maa Elections 2021 Winners : మా అధ్యక్షుడిగా మంచు విష్ణు టీమ్ ఇదే!

Maa Elections 2021 Winners : ప్రతిష్టాత్మకంగా, హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగాయి మా ఎన్నికలు. ఎప్పుడూ లేనంతగా ఈసారి హైప్ వచ్చింది. పైగా రెండు ప్యానళ్లలోనూ ప్రధానమైన అభ్యర్థులే బరిలో నిలిచారు. దీంతో ఎవరిని విజయం వరిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఎవరు విజయం సాధించారో, ఎవరు ఓడిపోయారో క్లారిటీ వచ్చింది. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఉంటారు. ఇంకా ఆయన కార్యవర్గంలో ఇప్పుడు ఎవరెవరు ఉంటారో కూడా స్పష్టత వచ్చింది.
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు
వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి
జనరల్ సెక్రటరీగా రఘుబాబు
ట్రెజరర్ గా శివబాలాజీ
జాయింట్ సెక్రటరీలుగా ఉత్తేజ్, గౌతమ్ రాజ్
వైస్ ప్రెసిడెంట్ గా హేమ
ఈసీ సభ్యులుగా అనసూయ, బ్రహ్మాజీ, శివారెడ్డి, ఖయ్యూం, కౌశిక్, కొండేటి సురేష్, సంపూర్ణేష్ బాబు.. వీళ్లంతా మంచు విష్ణు టీమ్ లో ఉంటారు
ఇప్పుడు మా ను ఎలా ముందుకు తీసుకువెళతారన్నదే మంచు విష్ణు ముందున్న అసలైన సవాల్. ఎందుకంటే ప్రచారం సందర్భంగా, మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన చాలా హామీలు ఇచ్చారు. అవి కూడా ఆయన గెలుపులో ప్రభావం చూపించాయి. సో.. వాటన్నింటినీ వచ్చే రెండేళ్ల వ్యవధిలో నెరవేర్చాల్సిన బాధ్యత ఆయన టీమ్ పైనే ఉంటుంది.
ఇప్పటివరకు రెండు ప్యానళ్లు ఎన్ని రకాలుగా విమర్శించుకున్నా.. ఇకపై మాత్రం కలిసికట్టుగా మా సభ్యుల సంక్షేమానికి కషి చేయాలని టాలీవుడ్ కోరుకుంటోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com