October 10 : సెమ్ డేట్.. అప్పుడు మోహన్ బాబు.. ఇప్పుడు విష్ణు.. లాస్ట్ పంచ్ ఎవరిదీ?

October 10: దేశ రాజకీయాల్లో ఉన్నంత ఆసక్తి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లోనూ నెలకొంది. ఒకప్పుడు ఇండస్ట్రీలోని పెద్దలే స్వయం నిర్ణయం తీసుకుని ఓ వ్యక్తిని అనుకునేవారు అతడికే ఆ బాధ్యతలు అప్పగించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.
పోటీలు, గ్రూపులు, ప్రత్యర్ధులు, మాటల యుద్ధం వెరసి మా ఎలక్షన్స్ ఓ ప్రహసనంగా మారాయి. అక్టోబర్ 10వ తేదీన జరిగే మా ఎన్నికల్లో అధ్యక్షుడెవరో తెలిసిపోతుంది. పోటీలో నిలిచిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు మంచి చెడులు నిర్ణయించుకోమని ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. పని చేసేవారు ఎవరో తెలుసుకుని ఓటెయ్యమని అడుగుతున్నారు.
ఇదిలా ఉంటే, 1998లో అక్కినేని నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షుడిగా, హీరో కృష్ణ అధ్యక్షుడిగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియషన్ ప్రారంభమైంది. పోటీలేకుండా ప్రశాంతంగా మా ఎన్నికలు జరుగుతుండేవి. కానీ ఈసారి అలాంటి వాతావరణం కనిపించట్లేదు.. తోటి ఆర్టిస్టులని చూసుకోకుండా ఒకరి మీద ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు.
సరిగ్గా 17 ఏళ్ల క్రితం 2004 అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మోహన్ బాబు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. మళ్లీ సరిగ్గా అదే రోజున ఇప్పుడు మా ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈసారి మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేస్తుండడం విశేషం. కానీ అప్పడు మోహన్ బాబుకు పోటీ ఎవరూ లేరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు.. ఇప్పుడు మంచు విష్ణుకి పోటీగా ప్రకాష్ రాజ్ బరిలో నిలిచారు.
ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది.. మరో నాలుగు రోజుల్లో జరగబోయే మా ఎన్నికల్లో ఎవరి ప్యానల్ నెగ్గుతుందో అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com