MAA Elections 2021: 'మా' ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్..

MAA Elections 2021: 'మా' ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. 'మా' ఎలక్షన్ నుంచి సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు తప్పుకున్నారు. ఇటీవలే 'స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సీవీఎల్ 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని ప్రకటించారు. తన మేనిఫెస్టోను సైతం విడుదల చేశారు. 'మా' సంస్థను ఆంధ్ర, తెలంగాణ అసోసియేషన్లుగా విభజించాలని సీవీఎల్ అన్నారు. రెండు ప్రాంతాల చిన్న కళాకారుల సంక్షేమమే లక్ష్యంగా తాను పని చేస్తానని చెప్పారు.
అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన తప్పుకున్నారు. దీంతో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానల్ మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్, ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. సాధారణ ఎలెక్షన్స్‌ను మించి ప్రచారం చేస్తున్నారు. రెండు ప్యానల్స్ ప్రచారాలు, విమర్శలు, ఆరోపణలతో టాలీవుడ్‌లో వాతావరణం హీట్ ఎక్కింది.
అయితే 'మా' లో తెలంగాణ నినాదంతో పోటీ చేస్తూ అందరినీ షాక్ ఇచ్చారు సీవీఎల్ నరసింహారావు. దీంతో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానల్ మధ్య ఉన్న ద్విముఖ పోరు కాస్త సీవీఎల్ ఎంట్రీతో త్రిముఖ పోటీగా మారింది. తాజాగా సీవీఎల్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో 'మా' ఎన్నికలు రసవత్తరంగా మారుతోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com