MAA: 'మా' టీమ్‌లో 'నా' వాళ్లు.. : ప్రకాశ్‌రాజ్

MAA: మా టీమ్‌లో నా వాళ్లు.. : ప్రకాశ్‌రాజ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్ష ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారనున్నాయి.

MAA: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్ష ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారనున్నాయి. త్రిముఖ పోరు కాస్తా నటి హేమ ఎంట్రీతో చతుర్ముఖ పోరుగా మారింది. ప్రస్తుతం నలుగురు సభ్యులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యుల వివరాలు ప్రకటించారు. మొత్తం 27 మందితో కూడిన సభ్యుల జాబితాను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ఎన్నికలను పురస్కరించుకుని మా శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా మా ప్రయాణం సాగుతుంది. మా ప్రతిష్ట కోసం నటీ నటుల బాగోగుల కోసం మా టీంతో రాబోతున్నా అని పేర్కొన్నారు. పదవుల కోసం కాదు.. పనులు చేయడం కోసం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని తెలిపారు.

1. ప్రకాష్ రాజ్, 2. జయసుధ, 3.శ్రీకాంత్, 4. బెనర్జీ, 5. సాయికుమార్, 6. తనీష్, 7. ప్రగతి, 8. అనసూయ, 9. సన, 10. అనిత చౌదరి, 11. సుధ, 12. అజయ్, 13. నాగినీడు, 14. బ్రహ్మాజీ, 15. రవిప్రకాష్, 16. సమీర్, 17. ఉత్తేజ్, 18. బండ్ల గణేష్, 19. ఏడిద శ్రీరామ్, 20. శివారెడ్డి, 21. భూపాల్, 22. టార్జాన్, 23. సురేష్ కొండేటి, 24. ఖయ్యుం, 25. సుడిగాలి సుధీర్, 26. గోవిందరావు, 27. శ్రీధర్‌రావు.. ఈ ప్యానల్‌లో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story