Prakash Raj : విష్ణు ప్యానల్ పై ప్రకాశ్ రాజ్ 60 ఓట్ల ఆరోపణ

Prakash Raj : విష్ణు ప్యానల్ పై ప్రకాశ్ రాజ్ 60 ఓట్ల ఆరోపణ
Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు.... రెండు ప్యానళ్ల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరింత సంచలనంగా మారుతున్నాయి.

Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు.... రెండు ప్యానళ్ల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరింత సంచలనంగా మారుతున్నాయి. తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు ప్రకాష్‌ రాజ్‌. మంచు విష్ణు ప్యానల్ ఏకంగా 60 వరకూ పోస్టల్ ఓట్లను దుర్వినియోగం చేసి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నం చేస్తోందని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు.

ఈసారి నిబంధల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వీలుంది. ఈ పేరు చెప్పి కొందరు ప్రముఖుల ఓట్ల కోసం పోస్టల్ బ్యాలెట్‌ రిక్వెస్ట్‌ పంపించారని, ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని వివరించారు.

పోస్టల్ బ్యాలెట్ కోరుతూ వచ్చిన లెటర్ల కవర్లు అన్నీ ఒకే రకంగా ఉన్నాయని ఒక్కో పోస్టల్ ఓటుకు కట్టాల్సిన డబ్బు అందరి తరపున మోహన్‌బాబు కంపెనీ‌లో పనిచేసే వ్యక్తి వచ్చి చెల్లించారని చెప్పారు. అందుకు కొన్ని పత్రాల్ని సాక్ష్యంగా చూపించారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని పోస్టల్ బ్యాలెట్‌ను రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.

60 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తామని అధికారులు చెప్తే తాము చాలా సంతోషించామని, కానీ దాన్నే ఉపయోగించుకుని ఇంత కుట్ర జరుగుతుదని అనుకోలేదని ప్రకాష్‌రాజ్‌ చెప్పారు. ఈ ఓటు దుర్వినియోగం కాకుండా చూడాలని తాము ముందే కోరామన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలనుకునేవారు. సెప్టెంబర్‌ 30వ తేదీలోపు ఎన్నికల అధికారికి లేఖ రాయాలి. అందులో 'మా మెంబర్‌షిప్' నంబరుతోపాటు వారి సంతకం చేసి పోస్టల్ ఓట్‌ కోసం విజ్ఞప్తి చేయాలి. వారు స్వయంగా రాలేకుంటే వాళ్ల తరపున ఒక వ్యక్తిని పంపాలి.

ఆ వ్యక్తి ఇక ఎవరికీ ఏజెంట్‌గా ఉండకూడదు అనే నిబంధన కూడా విధించారు. కానీ.. వీటన్నింటినీ ఉల్లంఘించి 60 మందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రిక్వెస్ట్ చేశారని ప్రకాష్ రాజ్ మండిపడుతున్నారు. ఆ ఓట్లకు సంబంధించిన డబ్బులు ఒకే వ్యక్తి చెల్లించడం ఏంటని ప్రశ్నించారు.

సీనియర్ సిటిజన్ల పోస్టల్ బ్యాలెట్‌ రిక్వెస్ట్‌లను నిన్న 4వ తేదీన వాటిని పరిశీలించి చూస్తే అవన్నీ ఒకరే పంపినట్టుగా అర్థమవుతోందన్నారు. ఎన్నికల అధికారి ఎవరికైతే పోస్టల్ బ్యాలెట్ అనుమతి ఇస్తారో వారికి ఓటు వేసే పత్రాల్ని కొరియర్‌ చేస్తారు.

వారు ఓటు వేసి తిరిగి వాటిని 9వ తేదీ లోపు 'మా'కు పంపాల్సి ఉంటుంది. వాటిని 10 తేదీ ఓట్లతో కలిపి లెక్కిస్తారు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్‌ను మంచు ప్యానల్ దుర్వినియోగం చేస్తోందనేది ప్రకాష్‌రాజ్ ప్యానల్ వాదన.

ఈ నెల 10వ తేదీన జరగాల్సిన ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు ప్యానళ్లు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. విష్ణు ప్యానల్ కావాలనే ఉద్దేశపూర్వకంగా నిబంధల్ని ఉల్లఘిస్తూ దిగజారి వ్యవహరిస్తోందని ప్రకాష్‌ రాజ్ ఆరోపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. అక్రమాలు జరుగుతున్నాయంటూ గద్గద స్వరంతో మాట్లాడారు.

Tags

Read MoreRead Less
Next Story