Maa Nanna Superhero : సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘మానాన్న సూపర్ హీరో’

నవదళపతి సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని అద్భుతంగా చిత్రీకరించిన ఈ చిత్రం, కుటుంబ సమేతంగా ఆనందించేలా రూపొందించబడింది.
ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో, ఒక తండ్రి తన కొడుకు కోసం ఎంతటి త్యాగానికి కూడా సిద్ధమవుతాడో చూపిస్తుంది. సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
సుధీర్ బాబుతో పాటు, షాయాజి షిండే, సాయి చంద్, ఆమని వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటించడం మరో ఆకర్షణ. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'యు' సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com