Mad 2 Trailer : సారీ.. మ్యాడ్ 2 ట్రైలర్ రావడం లేదు

మ్యాడ్.. యూత్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ను విపరీతంగా నవ్వించిన సినిమా. నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, శ్రీ గౌరిప్రియ, అనంతిక, గోపిక ఉదయన్, విష్ణు ఓయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ రూపొందింది. ఈ నెల 28న విడుదల కాబోతోన్న ఈ మూవీ సైతం ఫస్ట్ పార్ట్ తరహాలోనే నాన్ స్టాప్ గా నవ్విస్తుందని ప్రామిసింగ్ గా చెబుతున్నారు మేకర్స్. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే ఉంది.
ఇక ఈ మంగళవారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు అయింది. ప్రెస్ మీట్ టైమ్ ను మార్చారు. దీంతో కాస్త లేట్ గా ట్రైలర్ విడుదలవుతుందనుకున్నారు. బట్.. అసలు ఇవాళ ట్రైలర్ విడుదల చేయడం సాధ్యం కావడం లేదు సారీ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు నిర్మాత నాగవంశీ. ప్రస్తుతం ఈ మూవీ ఓవర్శీస్ డిస్పాచింగ్ జరుగుతోందని .. ఆ కారణంగా ఆలస్యం అయిందని చెప్పాడు. ఇక ట్రైలర్ ను రేపు విడుదల చేస్తాం అని ఇదే పోస్ట్ లో తెలియజేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com