Ravi Teja : రవితేజ మ్యాడ్ డెసిషన్

Ravi Teja :  రవితేజ మ్యాడ్ డెసిషన్
X

మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనుకుంటాం. సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా.. అతని వరకూ ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు. కాకపోతే ఈ మధ్య స్క్రిప్ట్ సెలెక్షన్ మరీ దారుణంగా తయారైంది. తక్కువ రోజుల్లో పూర్తి చేసే దర్శకులైతే చాలు అనుకుంటున్నాడు తప్ప.. సత్తా ఉన్న కథేనా కాదా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాడు అనేది అతనిపై ప్రధాన కంప్లైంట్. అందుకు కారణమేంటో అందరికీ తెలుసు. వరసగా ఈ మధ్య అన్నీ ఫ్లాపులే ఇస్తున్నాడు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ మూవీతో వస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ.

సోషల్ మీడియాలో సడెన్ గా రవితేజ నాని నిర్మించే ‘హిట్’ ఫ్రాంఛైజీలో నటించబోతున్నాడనే వార్తలు వ్యాపించాయి. ఈ ఫ్రాంఛైజీలో ప్రస్తుతం 3వ భాగంలో నాని నటిస్తున్నాడు. సినిమా చివర్లో నాలుగవ భాగం గురించిన లీడ్ ఉంటుందని.. ఆ లీడ్ ను బట్టి హిట్ 4 లో రవితేజ నటించబోతున్నాడు అనేది ఈ రూమర్స్ సారాంశం. బట్ అది నిజం కాదు. రవితేజ హిట్ 4 లో నటించడం లేదు. కానీ మ్యాడ్ డైరెక్టర్ కు ఓకే చెప్పాడు. యస్.. మ్యాడ్ తో అనూహ్యంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఇతన ప్రస్తుతం మ్యాడ్ 2 రూపొందిస్తున్నాడు. ఈ సెకండ్ పార్ట్ మార్చి 29న విడుదల కాబోతోంది. కళ్యాణ్ శంకర్ చెప్పిన కథ రవితేజకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడంటున్నారు. మాస్ జాతర తర్వాత అతను చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అని ఫిక్స్ అయిందంటున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి మ్యాడ్ 2 రిజల్ట్ ను బట్టి అనౌన్స్ అవుతుందా లేక ఆ రిజల్ట్ తో పనిలేకుండానే ప్రకటిస్తారా అనేది చూడాలి.

Tags

Next Story