Mad Square OTT Date : ఓటిటిలోకి మ్యాడ్ స్క్వేర్.. ఎప్పటి నుంచంటే..

Mad Square OTT Date :  ఓటిటిలోకి మ్యాడ్ స్క్వేర్.. ఎప్పటి నుంచంటే..
X

ఈ యేడాది టాలీవుడ్ కు చాలా తక్కువ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సంక్రాంతి కూడా సంక్రాంతికి వస్తున్నాం తప్ప మరో మూవీ సందడి చేయలేదు. ఫిబ్రవరి, మార్చి సైతం మురిపించలేకపోయాయి. కాకపోతే రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించి బాక్సాఫీస్ కు కొత్త కళ తెచ్చాయి. వాటిలో మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ మూవీస్ ఉన్నాయి. ఆల్రెడీ కోర్ట్ మూవీ ఓటిటిలో సత్తా చాటుతోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి అప్లాజ్ వస్తోంది. ఇప్పుడిక మ్యాడ్ బాయ్స్ వంతు వచ్చింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన మ్యాడ్ 2023లో విడుదలై సూపర్ హిట్ అయింది. అప్పుడే సెకండ్ పార్ట్ గురించి ఆలోచించినట్టున్నారు. అందుకే వెంటనే ప్రారంభించి ఈ యేడాది మార్చి 28న రిలీజ్ చేశారు. సెకండ్ పార్ట్ సైతం బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆడియన్స్ ను ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా కడుపుబ్బా నవ్వించింది. నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్, సునిల్, సత్యం రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సెకండ్ పార్ట్ లో ఫీమేల్ లీడ్ అంటూ పెద్దగా కనిపించకపోవడం విశేషం.

మొత్తంగా థియేటర్స్ లో ప్రేక్షకులను తెగ నవ్వించిన మ్యాడ్ బాయ్స్ ఇక ఓటిటిలోకి ఈ నెల 25నుంచి రాబోతున్నారు. ఇలాంటి మూవీస్ కు ఇంటిల్లిపాదీ చూసే అవకాశం ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ లో కాస్త క్రింజ్ కామెడీ ఉన్నా.. డబుల్ మీనింగ్స్, బూతు డైలాగులు ఉండవు. అంచేత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఓటిటిలో కూడా మెప్పించే అవకాశాలున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 25 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమ్ కాబోతోందీ మూవీ.

Tags

Next Story