Mad Square collections : ఫస్ట్ డే అదరగొట్టిన మ్యాడ్ మ్యాక్స్

మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా రూపొందిన సినిమా మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లోనే సితార బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రంపై రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. కుర్రాళ్లంతా మంచి ప్రమోషన్స్ కూడా చేశారు. అలా భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ లాగానే సెకండ్ పార్ట్ సైతం విపరీతంగా నవ్వించింది. దర్శకుడు రాసుకున్న డైలాగ్స్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. దీంతో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. టాక్ మాత్రమే కాదు.. ఫస్ట్ డేనే భారీ కలెక్షన్స్ సైతం కనిపిస్తున్నాయి.
మ్యాడ్ స్క్వేర్ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 20.8 కోట్లు వసూలు చేసి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది. ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ ను మాత్రం ఎవరూ ఊహించలేదు. అంతా కుర్రాళ్లే.. 20.8 కోట్లు ఓపెనింగ్ డే వసూళ్లు అంటే ఈసినిమా ఈజీగా 50 కోట్ల మార్క్ ను కూడా దాటబోతోందని అర్థం చేసుకోవచ్చు.
నార్నే నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓయి మేల్ లీడ్ లో మరోసారి తమదైన టైమింగ్ తో సత్తా చాటితే ఈ సారి సునిల్, సత్యం రాజేష్ సెకండ్ హాఫ్ కామెడీని మోశారు. చాలా రోజుల తర్వాత సునిల్, సత్యం రాజేష్ తమ కామెడీతో విపరీతంగా నవ్వించారు. మురళీధర్ గౌడ్ సైతం ఆకట్టుకున్నాడు. క్యారెక్టరైజేషన్స్ కంటిన్యూ అవుతూనే ఫస్ట్ పార్ట్ లో ఉన్న హీరోయిన్లు ఒక్కరు కూడా రిపీట్ కాకుండా అద్భుతమైన సన్నివేశాలతో అదరగొట్టాడు దర్శకుడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com