Mad Square : ఓవర్సీస్ లోనూ పిచ్చెక్కించారు

Mad Square  :  ఓవర్సీస్ లోనూ పిచ్చెక్కించారు
X

కుర్రాళ్లే కదా అనుకున్నారు. బట్ వీళ్లు బాక్సాఫీస్ కు పిచ్చెక్కించారు. మ్యాడ్ 2023లో విడుదలైన హిట్ కొట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అంటూ ఈ నెల 28న వచ్చారు. డిజే టిల్లు హిట్ అయింది కాబట్టి ఇదీ అవుతుందా అనుకున్నారు చాలామంది. బట్ అలాంటి వారందరికీ షాక్ ఇస్తూ ఇదీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగానూ రికార్డ్ స్థాయిలో మొదటి రోజే 20.08 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ కే షాక్ ఇచ్చిందీ మూవీ. నిజానికి సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకుంటూ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కంటెంట్ కూడా కామెడీఫుల్ గా ఉండటంతో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.

అయితే ఇలాంటి మూవీస్ తెలుగులో ఆడటం వరకు ఓకే. బట్ మ్యాడ్ 2 ఓవర్శీస్ లోనూ అదరగొడుతోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ ఒన్ మిలియన్ క్లబ్ లో చేరింది. కామెడీ సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఎంత మొహం వాచిపోయి ఉన్నారు అనేందుకు ఈ చిత్రం మరో ఉదాహరణగా ఉంది. యూత్ ఫుల్ మూవీ అయినా ఎక్కడా డబుల్ మీనింగ్ డైలాగ్స్, అసభ్యత, అశ్లీలత లేకుండా రూపొందిన సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మ్యాడ్ స్క్వేర్ కు ఎగబడి పోతున్నారు. మరి తెలుగులో కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ కు వెళుతుందో చూడాలి.

Tags

Next Story