MAD 2 Trailer : మ్యాడ్ 2 ట్రైలర్.. మరోసారి నవ్వుల జాతరే

మ్యాడ్ తో ఊహించని బ్లాక్ బస్టర్ కొట్టిన టీమ్ ఇప్పుడు మ్యాడ్ 2 అంటూ వస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. హీరోయిన్లు కాకుండా కుర్రాళ్లంతా రిపీట్ అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ లో కాలేజ్ నుంచి కామెడీ పండిస్తే ఈ సారి గోవా నుంచి వినోదాన్ని అందించబోతున్నారు అనిపిస్తోందీ ట్రైలర్ చూస్తుంటే. లడ్డు పెళ్లి సందర్భంగా అటెండ్ అయిన ఫ్రెండ్స్ అతని పెళ్లి చెడగొట్టి మరీ గోవా తీసుకుని వెళతారు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లు ఎలాంటి రచ్చ చేశారు. ఆ సందర్భంగా ఎంత ఫన్ జనరేట్ అయ్యింది అనే సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే ఈ సారి కూడా రైటింగ్ పరంగా అమాయకత్వంతో కూడిన సెటైర్స్ తో పాటు డైలాగ్స్ కనిపిస్తున్నాయి.
‘వీడి అసలు రంగు బయట పడింది అంటే స్కిన్ కలర్ అనుకునే లడ్డూ మామ, పిడికిట్లో బిగిస్తే.. ఇసుకలా జారిపోయారు అంటే వాళ్లను పట్టుకోమంటే ఇసుకెందుకు పట్టుకున్నావ్ అనే పోలీస్, గోవాలో అంతా గలీజ్ గాళ్లే ఉన్నారు అని లడ్డూ అంటే అవును మామ తెలుగోళ్లంతా ఇక్కడే తిరుగుతున్నారు అని చెప్పే నార్నే నితిన్.. రఘుబాబు కొత్త జంటల కామెడీ.. ఇవన్నీ హిలేరియస్ గా నవ్వించబోతున్న సీన్స్ కు ఇన్ డైరెక్ట్ గా చెబుతోన్న అంశాలుగానే కనిపిస్తున్నాయి. మొత్తంగా కథ, లాజిక్స్ వెదక్కుండా సినిమాకు రండి.. ఎంటర్టైన్ కండి అని నిర్మాతతో పాటు దర్శకుడు ముందు నుంచీ చెబుతున్నాడు. సో.. అలా ప్రిపేర్ అయి వెళితే మరోసారి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు అనేందుకు గ్యారెంటీ ఇస్తున్నట్టుగా ఉందీ ట్రైలర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com