Priyanka Chopra : పరిణితీ పెళ్లికి ప్రియాంక డుమ్మా వెనుక ఉన్న అసలు కారణం ఇదే..

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, నటి పరిణీతి చోప్రా వివాహం సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ హోటల్‌లో అట్టహాసంగా జరిగింది. వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వివాహ వేడుక తర్వాత, కొత్తగా పెళ్లయిన జంట తమ అతిథుల కోసం వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. అయితే, పరిణీతి కజిన్ సోదరి, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా వీరి వివాహ వేడుకకు హాజరు కాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే సోమవారం ఉదయం, ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్లతో సంభాషణలో మునిగిపోయి, ప్రియాంక వివాహ వేడుకకు ఎందుకు హాజరు కాలేదో వెల్లడించింది. పెళ్లి ఎలా జరిగిందని ఆమెను అడగగా.. దానికి ఆమె చాలా బాగా జరిగిందని అని బదులిచ్చింది. పరిణీతి, రాఘవ్‌ల పెళ్లికి ప్రియాంక ఎందుకు హాజరు కాలేదని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మధు చోప్రా.. తనకు వర్క్ కమిట్ మెంట్స్ ఉన్నాయని, అందుకే పెళ్లి మిస్సవ్వాల్సి వచ్చిందని చెప్పింది. ఆ తర్వాత పెళ్లి రోజున పరిణీతి ఎలా ఉందని అడిగినప్పుడు, మధు.. “ఆమె చాలా అందంగా ఉంది. పెళ్లిలో ఆమె మరింత అందంగా కనిపించింది అని చెప్పింది.
అంతకుముందు రాఘవ్ - పరిణీతిలు తమ అధికారిక వివాహ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వధువు పరిణీతి చోప్రా ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన వివాహ దుస్తులను ధరించింది. మిస్టర్ అండ్ మిసెస్‌గా రాఘవ్ - పరిణీతికి సంబంధించిన మరిన్ని గ్లింప్స్ చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Priyanka Chopra’s Mother Madhu Chopra finally React on Why Priyanka Not attending Pari Wedding !! pic.twitter.com/vDI8WWhb5P
— Crazy 4 Bollywood 💙 (@crazy4bolly) September 25, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com