Madhuri Dixit: అద్దె ఇంటికి లక్షల్లో రెంట్ కడుతున్న సీనియర్ నటి.. షాకవుతున్న నెటిజన్లు..

Madhuri Dixit (tv5news.in)

Madhuri Dixit (tv5news.in)

Madhuri Dixit: ముంబాయిలోని పాష్ ఏరియాల్లో వొర్లి ఒకటి. అక్కడే మాధురీ దీక్షిత్ ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగనుందట.

Madhuri Dixit: సినిమావారు చాలావరకు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనకాడరు. కొందరు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటే మరికొందరు మాత్రం అద్దె ఇంటినే అందంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఓ సీనియర్ నటి కూడా అలాగే చేయనుంది. కానీ తన ఇంటి రెంట్ గురించి తెలిసిన నెటిజన్లు షాకవ్వక తప్పట్లేదు.


బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్‌ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా.. తన ఛార్మ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఇంతకు ముందులాగా ఎక్కువగా సినిమాల్లో, స్పెషల్ సాంగ్స్‌లో కనిపించకపోయినా.. తనకు నచ్చిన పాత్ర వస్తే మాత్రం మాధురీ... నో చెప్పట్లేదు. తాజాగా మాధురీ దీక్షిత్, తన భర్త శ్రీరామ్‌ మాధవ్ నేనేతో కలిసి ఓ కొత్త ఇంటిని అద్దెకు తీసుకోనుందట.


ముంబాయిలోని పాష్ ఏరియాల్లో వొర్లి ఒకటి. అక్కడే మాధురీ దీక్షిత్ ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగనుందట. అద్దె కోసం తాను ఓ డిజైనర్‌తో అపార్ట్‌మెంట్‌ను అందంగా తయారు చేయించిందట. ఈ విషయాన్ని ఆ డిజైనర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అయితే ఆ అపార్ట్‌మెంట్ అద్దె నెలకు రూ.12.5 లక్షలు అని సమాచారం. ఇంత రెంట్ కడుతున్న యాక్టర్స్‌లో మాధురీ మొదటిది కాదు. బాలీవుడ్‌లో చాలామంది నటీనటులు అద్దె ఇంటి కోసం ఇలాగే లక్షల్లో ఖర్చు పెడుతున్నారు.

Tags

Next Story