Madhuban Song: సన్నీలియోన్ సాంగ్‌పై హోంమంత్రి సీరియస్..

Madhuban Song: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా నటించిన మధుబన్ సాంగ్.. వివాదాస్పద మవుతోంది. ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని.. వెంటనే సాంగ్ తొలగించాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. షరీబ్, తీషి పాడిన మధుబన్ మే రాధిక నాచే పాట ఈనెల 22న విడుదలైంది.
ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది. అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు అర్చకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 1960లో వచ్చిన కోహినూర్ సినిమాలోని మధుబన్ మే రాధిక నాచే రే అనే పాటను పోలి ఉందన్నారు.
కేవలం అర్చకుల నుంచే కాకుండా.. గత ఆరు రోజులుగా మధుబన్ సాంగ్‌పై.. అన్ని వర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు ఎక్కువయ్యాయి. ఈ నేసథ్యంలో మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా దీనిపై స్పందించారు. పాటలో కావాలనే కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా పదాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సన్నీ లియోన్‌తోపాటు పాటపాడిన వారు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. రెండు, మూడ్రోజుల్లోగా ఈ అభ్యంతరకర వీడియోను తొలగించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హోంమంత్రి హెచ్చరికలతో వీడియోను రిలీజ్ చేసిన మ్యూజిక్ కంపెనీ పాటలోని కొన్ని పదాలను మర్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలను ఇబ్బంది పెట్టే లిరిక్స్ ఉండబోవని తెలిపింది. కాగా మార్చిన పాటను రెండు, మూడు రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com