హీరో సూర్యకి మద్రాస్ హైకోర్టు షాక్.. రూ. 3 కోట్లు చెల్లించాల్సిందే ..!

హీరో సూర్యకి మద్రాస్ హైకోర్టు షాక్.. రూ. 3 కోట్లు చెల్లించాల్సిందే ..!
నటుడు సూర్యకి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. దాదాపు రూ.3 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య పిటిషన్‌ను వేశాడు

నటుడు సూర్యకి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. దాదాపు రూ.3 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య పిటిషన్‌ను వేశాడు సూర్య.. దీనిపైన విచారణ చేపట్టిన హైకోర్టు సూర్య వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్య తన ఆదాయానికి తగ్గట్టు పన్నులు చెల్లించడం లేదనే కారణంతో 2010లో ఆదాయపు పన్ను శాఖ ఏకకాలంలో ఆయనకు సంబంధించిన ఇళ్లు, వ్యాపార స్థలాల్లో సోదాలు నిర్వహించారు. పలు ఆదాయాలకు సంబంధించి మొత్తం రూ. 3.11 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 220 (2A) ప్రకారం వడ్డీని మినహాయించాలని కోరుతూ సూర్య మద్రాస్ హైకోర్టులో దాఖలు చేశాడు కానీ హైకోర్టు మాత్రం దీనిని తిరస్కరిచింది. సెలబ్రిటీ స్థానంలో మీరు మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని చెబుతూ ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story