రెహమాన్ మ్యూజిక్ లో ఆ మ్యాజిక్ ఏమైంది..?

రెహమాన్ మ్యూజిక్ లో ఆ మ్యాజిక్ ఏమైంది..?
AR Rahaman: రెహమాన్ భారత సంగీత ప్రపంచంలో ఈయన ఒక సంచలనం.

AR Rahaman: రెహమాన్ భారత సంగీత ప్రపంచంలో ఈయన ఒక సంచలనం. అతిచిన్న వయసులోనే కీబోర్డ్ ప్లేయర్ గా తన కెరీర్ ని ప్రారంబించి.. తరువాత సంగీత దర్శకుడిగా మారి.. తన మ్యూజిక్ తో ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు ఈ సంగీత చక్రవర్తి. ప్రపంచ స్థాయి మ్యూజిక్ ఇవ్వగలిగే ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్లలో రహమాన్ టాప్ లో ఉంటాడు ."స్లండాగ్ మిలియనీర్" సినిమాకి అందించిన మ్యూజిక్ కి గాను "ఆస్కార్ అవార్డు" అందుకున్నాడు రహమాన్. ఈ సినిమా లోని "జయహో" పాట ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికి తెలిసిందే.

స్వరకర్త కోటి శిష్యునిగా పరిచయం అయిన రహమాన్.. అనతి కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. 1992లో మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన "రోజా" మూవీకి తోలిసారిగా సంగీతం అందించారు రహమాన్. తోలి సినిమాకే నేషనల్ అవార్డు, తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నాడు రహమాన్. ఆ తరువాత మణిరత్నం అన్ని సినిమాలకి రహమానె మ్యూజిక్ అందిస్తూ వస్తున్నాడు. అలా వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ పెద్ద హిట్ అయ్యాయి. బొంబాయి, ఇదరు, యువ, అమృత, వంటి సినిమాలు కోవాలోకే వస్తాయి. ప్రస్తుతం మణిరత్నం ఎంతో ప్రతిశ్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం "పొన్నియన్ సెల్వన్" అనే పాన్ ఇండియా మువీకి సంగీతం అందించే పనిలో ఉన్నాడు రహమాన్ .

స్టార్ డైరెక్టర్ శంకర్-రహమాన్ కాంబినేషన్ వచ్చిన ప్రతీ పాట శ్రోతలని ఉర్రూతలూగించాయి. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, జీన్స్, బాయ్స్ వంటి సినిమాలకి రహమాన్ ఇచ్చిన పాటలు ఇప్పటికి సంగీత ప్రియుల చెవిలో మోగుతూనే ఉంటాయి. అందుకే వీళ్ళదరిది హిట్ పెయిర్ అంటారు. కాని ఈ మద్య ఈ కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా ఆడలేదు.

అయితే రహమాన్ మ్యూజిక్ లోని ఆ మ్యాజిక్ ని ప్రేక్షకులు ఈమద్య మిస్ అవుతున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మద్య రహమాన్ నుండి వచ్చిన పాటలు అంతగా ఆకట్టుకోకపోవడమే అని చెప్పాలి. తను మ్యూజిక్ అందిస్తున్న సినిమాల్లోని పాటలు ఒకటి అలా హిట్ అవుతున్నా.. 90 దశకాల్లోని తన మ్యాజిక్ ని మాత్రం రిపీట్ చేయలేకపోతున్నాడు రహమాన్. ఆ మద్య నాగచైతన్య హీరోగా వచ్చిన "ఎం మాయ చేసావే" సినిమాలోని పాటలన్ని పెద్ద హిట్ అయ్యి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కేవలం పాటలకోసమే ఈ సినిమాని చూసినవాళ్ళు ఉన్నారంటే అతిశ్స్యోక్తి కాదు. రహమాన్ మల్లి తన మ్యూజిక్ లోని మ్యాజిక్ రిపీట్ చేసి శ్రోతలని ఆకట్టుకోవాలని ఆశిద్దాం.



Tags

Read MoreRead Less
Next Story