Mahaa Natulu Trailer : హారర్ అండ్ కామెడీతో భయపెడ్తూ నవ్విస్తోన్న 'మహానటులు'

Mahaa Natulu Trailer : హారర్ అండ్ కామెడీతో భయపెడ్తూ నవ్విస్తోన్న మహానటులు
X
'మహానటులు' ట్రైలర్ రిలీజ్.. యాక్టింగ్ లో అదరగొట్టిన నటీనటులు

అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా 'మహానటులు'. ఈ మూవీకి అశోక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహానటులు టీజర్ ను మేకర్స్ అఫిషియల్ గా రిలీజ్ చేశారు.

హీరోయిన్ తో లవ్ లో పడ్డ విషయం హీరో తన తల్లికి చెప్పడంతో అసలు స్టోరీ మొదలవుతుందని మహానటులు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని హీరో చెప్పడంతో.. ఆమె చనిపోయి చాలా కాలం అయింది కదా అని అతని తల్లి చెప్పడంతో హీరో షాక్ అవుతాడు. అయితే మరి తనతో ఉన్నదెవరంటూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆమెతో హీరోకు మొదలైన ఇబ్బందులు, ఏర్పడ్డ భయాలు మూవీని మరో లెవల్ కు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. గోల్డీలో ఆత్మ ఉందని తెలుసుకున్న అభినవ్.. ఆమె నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తుంటాడు. ఈ క్రమంలో హీరో, హీరోయిన్ తో పాటు వారి ఫ్రెండ్స్ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ హారర్ అండ్ కామెడీ కథాంశంగా తెరకెక్కినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో ఫుల్ మూవీ చూడాలన్న క్యూరియాసిటీని కూడా కలిగిస్తోంది.

ఇప్పటివరకు చాలా సినిమాలు తీశాను కానీ కామెడీ జానర్ ను టచ్ చేయలేదని, ఈ సినిమాను ఫుల్ ఫన్ అండ్ హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ తో రూపొందించనున్నట్టు దర్శకుడు అశోక్ కుమార్ ఇంతకు మునుపే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈ ట్రైలర్ ఉంది. అప్పట్లో బ్లాక్ బస్టర్ వద్ద మంచి విజయం సాధించిన జాతిరత్నాలు తరహాలో సినిమా ఉంటుందని కూడా అశోక్ కుమార్ తెలిపారు. మూవీ చూసినప్పుడు కూడా ట్రైలర్ ను చూసినప్పుడు వచ్చిన ఎక్స్ పీరియన్సే చేస్తే.. ఈ చిత్రం కూడా మంచి హిట్ అవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.



Tags

Next Story