Mahabharata : మహాభారత్ వెబ్‌సిరీస్.. హాట్‌ స్టార్‌లో ఎప్పుడంటే..

Mahabharata : మహాభారత్ వెబ్‌సిరీస్.. హాట్‌ స్టార్‌లో ఎప్పుడంటే..
Mahabharata : బాహుబలి తరువాత అనేక మంది మహాభారతాన్ని రాజమౌలి దర్శకత్వంలో చూడాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

Mahabharata : మహాభారతం మూవీపై హాట్‌స్టార్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. బాహుబలి తరువాత అనేక మంది మహాభారతాన్ని రాజమౌలి దర్శకత్వంలో చూడాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీని పై అల్లు అరవింద్ గతంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహాభారతాన్ని తానే నిర్మిస్తానని స్పష్టం చేశారు. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది.

బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి అల్లు అరవింద్ దీన్ని నిర్మించనున్నారు. సినిమాలా కాకుండా వెబ్ సిరీస్‌గా దీనిని అల్లు ఎంటర్టైన్మెంట్, మేధోవర్స్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. దర్శకుడు, నటీనటులు, సంగీత దర్శకుల వివరాలను ఇంకా ప్రకటించలేదు. డిస్నీ హాట్‌స్టార్‌లో త్వరలో ఇది స్ట్రీమ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Tags

Next Story