'మహర్షి' హీరోయిన్ ను గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎలా మారిపోయిందో..

మహర్షి హీరోయిన్ ను గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎలా మారిపోయిందో..
Tollywood: 'మహర్షి' 1987లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ సినిమాలోని ప్రతిపాట సూపర్ హిట్.

Shanthi Priya: 'మహర్షి' 1987లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ సినిమాలోని ప్రతిపాట సూపర్ హిట్. ఈ చిత్రంలో ఇళయరాజా స్వరపరచిన ' ' మాటరాని మౌనమిది' , ' ' సుమం ప్రతి సుమం సుమం' ' అనే సాంగ్స్ శ్రోతలను ఉర్రుతలుగించాయి. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాఘవ, శాంతి ప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శాంతి ప్రియ.. ప్రముఖ హీరోయిన్ భానుప్రియ చెల్లెలే. రాజమండ్రికి చెందిన ఈ అక్కచెల్లెళ్లు సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. శాంతి ప్రియకు నిశాంతి పేరు కూడా ఉంది.

1987లో తమిళంలో వచ్చిన "ఊరు ఎంగ పాటుక్రన్" అనే తమిళ చిత్రంలో శాంతిప్రియ హీరోయిన్ గా నటించింది. తెలుగులో 'మహర్షి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. జగపతిబాబు, శాంతిప్రియ హీరో, హీరోయిన్లుగా సింహ స్వప్నం" చిత్రంలో నటించారు. జగపతి ఆర్ట్స్ నిర్మించగా.., మధుసూదన్ రావు దర్శకత్వంలో వహించారు. రక్తకన్నీరు, శిలాశాసనం జస్టిస్ రుద్రమదేవి వంటి చిత్రాల్లో కనిపించారు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆఫర్లు రావడంతో అక్షయ్ కుమార్ సరసన సుగంద్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడంతో తెలుగులో సినిమాలు తగ్గిపోయాయి.

1999లో వి.శాంతారామ్ మనవడైన సిద్ధార్థరాయ్ ని వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగ కొనసాగుతున్న వీరి వైవాహిక జీవితంలో ఒక్కసారిగా పెను విషాదం చోటు చేసుకుంది. 2004లో సిద్ధార్థ రాయ్ కి గుండె నొప్పి రావడంతో ఆయన మరణించారు. ఏడు సంవత్సరాల పాటు శాంతిప్రియ పబ్లిక్ లైఫ్ కి దూరంగా ఉన్నారు. 2011లో మిథున్ చక్రవర్తి కొడుకు మహా అక్షయ్ హీరోగా నటించిన హామిల్టన్ అనే హిందీ చిత్రంలో ఆమె ప్రధానపాత్ర పోషించారు. అయితే తెలుగులో కూడా మరికొన్ని చిత్రాలు చేయాలని సినీప్రియులు కోరుకుంటున్నారు.Tags

Read MoreRead Less
Next Story