Maharshi Raghava : మహర్షి రాఘవ ఇంట విషాదం ..!

Maharshi Raghava : సినీ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి గోగినేని కమలమ్మ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 84సంవత్సరాలు... అమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కాగా కమలమ్మకి ఇద్దరు కుమారులు... అందులో రాఘవ పెద్దవాడు.రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక కమలమ్మ అంత్యక్రియలు రేపు మహప్రస్థానంలో జరగనున్నాయి. రాఘవ సినిమాల విషయానికి వచ్చేసరికి వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో కథానాయకుడిగా నటించాడు.
ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.. టీవీ సీరియల్స్ లో ద్వారా కూడా బాగా ఫేమస్ అయ్యాడు రాఘవ.. చిత్రం భళారే విచిత్రం, జంబలకిడిపంబ, కోరుకున్న ప్రియుడు. శుభాకాంక్షలు, సూర్యవంశం మొదలగు చిత్రాలలో నటించాడు రాఘవ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com