Mahavatar Narsimha : వీక్ డేస్ లోనూ నరసింహ ఉగ్రరూపం

Mahavatar Narsimha :  వీక్ డేస్ లోనూ నరసింహ ఉగ్రరూపం
X

ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసుకుని సినిమాలు విడుదల చేస్తేనే జనం పట్టించుకోవడం లేదు ఈ మధ్య. అలాంటిది ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా.. స్టార్ వాల్యూ అనే మాటే లేకుండా కేవలం యానిమేషన్ తో వచ్చిన ఓ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో కావడం విశేషం. ఆ సినిమా మహావతార్ నరసింహా. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నర్మించిన హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. జూలై 25న విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. సింపుల్ గా చెబితే ఇది భక్త ప్రహ్లాద సినిమా. కానీ యానిమేషన్ లో ఉండటం.. పిల్లలతో పాటు పెద్దలను కూడా విశేషంగా ఆకట్టుకునేలా ప్రొడక్షన్ వాల్యూస్ ఉండటం వల్ల మూవీ దుమ్మురేపుతోంది. మామూలుగా ఇలాంటి చిత్రాలు వీకెండ్స్ లో ఆకట్టుకుంటాయి. కానీ మహావతార్ మాత్రం వీక్ డేస్ లో కూడా అదే స్థాయి కలెక్షన్స్ తో అదరగొడుతోంది. సోమ, మంగళవారాల్లో లక్షల్లో టికెట్స్ అమ్ముడవుతున్నాయి.

ఈ మంగళవారం ఒక్క రోజే 2 లక్షల 30వేలకు పైగా టికెట్స్ తెగాయి అంటే ఊహించుకోండి.. ఈ మూవీ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో. ఈ మూవీ ధాటికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా తేలిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ఆకట్టుకుంటోంది మహావతార్ ఉగ్రనరసింహా. టైటిల్ కు తగ్గట్టుగానే తన ఉగ్రరూపాన్ని బాక్సాఫీస్ కు చూపిస్తోందీ మూవీ. ఇక అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని క్లీమ్ ప్రొడక్షన్స్ సంస్థ ఎడిట్ చేసింది. శ్యామ్ సి ఎస్ సంగీతం అందించాడు. భక్తి రసాత్మకంగా ఉంటూనే గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూపుతోంది ఈ ఉగ్రనరసింహుడి రూపం.

Tags

Next Story