Mahavatar Narsimha : ఇదేం ఉగ్రరూపం బాబోయ్

మహావతార్ నరసింహ ఉగ్రరూపం బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. కొన్ని చోట్ల ఈ మూవీ గురించి సరిగా తెలియకపోయినా కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్మురేపుతోంది. భక్త ప్రహ్లాద కథను యానిమేటెడ్ వెర్షన్ లో చెప్పినా పిల్లలతో పాటు పెద్దలు ఈ చిత్రాన్ని భక్తిగా చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తెరపై నరసింహ రూపం వచ్చినప్పుడల్లా విజిల్స్ పడుతున్నాయి. అయితే ఈ కథను పూర్తిగా భక్తి పూర్వకంగా కాక కాస్త మాస్ ఎలిమెంట్స్ ను కూడా యాడ్ చేసిన చెప్పడంతో ఆ హై మూమెంట్స్ ను కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే రిలీజ్ అయిన 10 రోజుల్లోనే ఏకంగా 105 కోట్లు కొల్లగొట్టింది. తెలుగు, కన్నడతో పాటు హిందీలోనూ వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి.
అశ్విన్ కుమార్ రూపొందించిన ఈ మహావతార్ ను హొంబలే ఫిల్మ్స్, క్లీమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ నిర్మించాయి. శామ్ సిఎస్ సంగీతం అందించాడు. ఇక ఆగస్ట్ 14 వరకూ పెద్ద సినిమాలేం లేవు కాబట్టి.. ఖచ్చితంగా ఈ ఫిగర్స్ ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com