12 Aug 2022 11:20 AM GMT

Home
 / 
సినిమా / Macherla...

Macherla Niyojakavargam Twitter Review : కొత్త బాడీ లాంగ్వేజ్‌తో నితిన్.. యాక్షన్ కామెడీ ప్యాక్డ్ డ్రామా..

Macherla Niyojakavargam Twitter Review : పోస్టర్ ట్రైయిలర్ టైటిల్‌కు తగ్గట్టే మాచర్ల నియోజకవర్గం యాక్షన్ ప్యాక్డ్ డ్రామా.

Macherla Niyojakavargam Twitter Review : కొత్త బాడీ లాంగ్వేజ్‌తో నితిన్.. యాక్షన్ కామెడీ ప్యాక్డ్ డ్రామా..
X

Macherla Niyojakavargam Twitter Review : పోస్టర్ ట్రైయిలర్ టైటిల్‌కు తగ్గట్టే మాచర్ల నియోజకవర్గం మొత్తం యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా చెప్పుకోవచ్చు. నితిన్ ఇందులో అంతకు ముందెన్నడూ లేని మాస్ లుక్ బాడీ ల్యాంగ్వేజ్‌తో కనిపిస్తాడు. మాస్‌తో పాటు కామెడీ కావాలనుకునే ఆడియన్స్‌కు మూవీ బాగా నచ్చుతుంది. వెన్నల కిషోర్ కడుపుబ్బా నవ్విస్తాడు. సముథిరకని విలన్‌గా అదరగొట్టాడని చెప్పవచ్చు. ఇక క్రితి షెట్టి, కాథరీన్ త్రెస స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

కథ విషయానికి వస్తే.. సిద్దూ (నితిన్) అప్పుడే ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తయి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంటాడు. మాచర్ల నియోజగవర్గంలో ఉన్న స్వాతి(క్రితిశెట్టి)తో ప్రేమలో పడతాడు. అక్కడే సిద్దూకు పోస్టింగ్ వస్తుంది. రాజప్ప సిద్దూ మధ్య విభేదాలు వస్తాయి. అసలు రాజప్పకు సిద్దూకు మద్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొత్తం సినిమా చూడాల్సిందే..

దర్శకుడు ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి అద్భుతంగా మూవీని తెరకెక్కించారు. మహతీ స్వర సాగర్ సంగీతం, బీజీఎం యాక్షన్ సీక్వెన్స్‌లకు సరిగ్గా సరిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో ఏమన్నారంటే..


Next Story