నాన్న ఒడిలో నిద్రపోతే ఎంత హాయి..

నాన్న ఒడిలో నిద్రపోతే ఎంత హాయి..
మహేష్ బాబు క్యూట్ బంగారం సితార కూడా అందుకు మినహాయింపు కాదు.

అమ్మేమో ఇంకా తెల్లారలేదా అని అరుస్తుంది. నాన్నేమో సెలవులేగా కొద్ది సేపు పడుకోనివ్వకూడదూ అంటాడు. దీంతో పిల్లలు నాన్న పార్టీలో చేరిపోతారు. మరి మహేష్ బాబు క్యూట్ బంగారం సితార కూడా అందుకు మినహాయింపు కాదు. లేవాలంటే నాన్న ఒడిలో కాసేపు నిద్ర పోవాలి. ఆ తరువాత లేస్తే ఆరోజు మరింత ఫ్రెష్ గా ఉంటుంది అన్న విషయం సితార పాపకు బాగా తెలిసినట్లుంది. అందుకే అలా ఒదిగి పోయింది.

ఇక నమ్రత ఈ ఫోటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ఉదయాన్నే గట్టిగా కౌగలించుకోవడం తప్పనిసరి! లేదంటే నిద్ర నుంచి తేరుకోవడం చాలా కష్టం. నిద్ర లేపడానికి ఇదో మంత్రం. అని సితార అలవాటుని బహిర్గతం చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా మహేశ్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్నారు. అ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story