Mahesh Babu : లక్షరీ, కంఫర్ట్ పెంచిన మహేష్ బాబు

హీరోల సినిమాలు థియేటర్స్ లో దుమ్మురేపడం చూస్తుంటాం. ఇప్పుడు హీరోలే థియేటర్స్ కట్టేస్తున్నారు. ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు తమదైన శైలి బిజినెస్ తో ఆకట్టుకుంటన్నారు. హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏసియన్ కలయికలో ‘ఏ.ఎమ్.బి సినిమాస్’ అంటూ పెద్ద మాల్ లో అద్భుతమైన థియేటర్స్ ఉన్నాయి. ప్రతి థియేటర్ పాష్ గా ఉంటుంది. క్లాస్ గా కనిపిస్తుంది. కాకపోతే మాస్ థియేటర్స్ లో సినిమాలు చూసిన అనుభూతి ఈ థియేటర్స్ లో లభించదు. కానీ సెలబ్రిటీస్ తో రిచ్ పీపుల్ కు కంఫర్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఆ కంఫర్ట్ తో పాటు లక్షరీని కూడా మరింత పెంచాం అంటూ ప్రకటించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఇదే మాల్ లో ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్స్ పీరియన్స్ ను అందిస్తూ లక్షరీ, కంఫర్ట్ లెవల్స్ ను డబుల్ చేస్తూ సరికొత్త ఫీచర్స్ తో థియేటర్స్ అందుబాటులోకి తెచ్చాం అంటూ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అనౌన్స్ చేశాడు మహేష్. దీనికి ‘‘MB LUXE’’ అనే పేరు కూడా పెట్టారు. అంటే మహేష్ బాబు రేంజ్ లక్షరీ ఎక్స్ పీరియన్స్ ఈ థియేటర్స్ లో ఉంటుందన్నమాట. ఏదేమైనా ప్రేక్షకులు కొత్తగా వచ్చే దేన్నైనా ఇమ్మీడియొట్ గా ఎక్స్ పీరియన్స్ చేయాలనుకుంటారు. సో.. ఈ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందో కూడా త్వరలోనే రివ్యూస్ రూపంలో బయటకు వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com