Mahesh Babu : మహేష్ బాబు బెండ్ తీస్తున్న రాజమౌళి

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ అంటే రాజమౌళి, మహేష్ బాబుదే.కాస్త ఆలస్యం అయినా సెట్ అయింది. కొన్ని రోజుల క్రితం సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు. రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక షెడ్యూల్ ను ఒడిషా పూర్తి చేశారు. ఆ సందర్భంగా కొంత ఫుటేజ్ లీక్ అయింది. దీంతో తన సెట్స్ లో మూడంచెల భద్రత ఏర్పాటు చేయించాడు రాజమౌళి. ఒడిషా షెడ్యూల్ తర్వాత టీమ్ మొత్తం కొంత గ్యాప్ తీసుకుంది. మరి ఇలాంటి గ్యాప్ లు వస్తే.. అదీ సమ్మర్ లో అంటే మహేష్ ఆగుతాడా.. వెంటనే ఫ్యామిలీతో కలిసి రోమ్ ట్రిప్ కు వెళ్లాడు.అటు ప్రియాంక చోప్రా కూడా అత్తగారి దేశానికి వెళ్లిపోతే.. రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ను సెట్ చేసుకున్నాడు.
ఇక ఈ మంగళవారం మహేష్ బాబు వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ వచ్చేశాడు.జక్కన్న కూడా ఎప్పుడో వచ్చాడు. నెక్ట్స్ షెడ్యూల్ ప్లానింగ్ ఫైనల్ చేసుకున్నాడు. సో.. త్వరలోనే మళ్లీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. మామూలుగా ఇంత హాట్ సమ్మర్ లో మహేష్ బాబు షూటింగ్ అంటే ఎక్కువగా డుమ్మా కొట్టేసి వెకేషన్స్ కు వెళ్లిపోతుంటాడు. బట్ ఈ సారి రాజమౌళి కదా.. పాస్ పోర్ట్ దగ్గరే పెట్టుకుంటాడు. మొత్తంగా జక్కన్న మహేష్ బాబు బెండ్ తీస్తున్నాడనేది మాత్రం కన్ఫార్మ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com