11 May 2022 10:00 AM GMT

Home
 / 
సినిమా / Mahesh Babu : బాలీవుడ్...

Mahesh Babu : బాలీవుడ్ గురించి నేనలా అనలేదు.. మహేష్ క్లారిటీ...!

Mahesh Babu : బాలీవుడ్ తనను భరించలేదు అన్న వ్యాఖ్యల పైన సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు..

Mahesh Babu : బాలీవుడ్ గురించి నేనలా అనలేదు.. మహేష్ క్లారిటీ...!
X

Mahesh Babu : బాలీవుడ్ తనను భరించలేదు అన్న వ్యాఖ్యల పైన సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు.. మన తెలుగు సినిమాలు బాలీవుడ్ కి రీచ్ అవ్వాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ పైన తాను ఎప్పుడుకూడా నెగిటివ్ కామెంట్ చేయలేదని అన్నాడు. తనకు సినిమా అంటే ఇష్టమని, అన్ని బాషలను గౌరవిస్తానని తెలిపాడు.

తాను పదేళ్ల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరుతుంది. మన తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయని అన్నాడు.. ఇక బాలీవుడ్ సినిమాలు చేయలేదని చెప్పలేదని, తెలుగు సినిమా సౌకర్యంగా ఉందని చెప్పానని, మన ఇండస్ట్రీని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అన్నది తన ఫీలింగ్ అని సూపర్ స్టార్ తెలిపాడు.

కాగా అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా.. మీడియా ఇంట్రాక్షన్ సందర్భంగా బాలీవుడ్ ఎంట్రీ గురించి మహేష్ మాట్లాడుతూ.. బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయని, కానీ తనను బాలీవుడ్ ప్రొడ్యూసర్లు భరించలేరని కామెంట్ చేశాడు.

టాలీవుడ్ తనకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ తీసుకొచ్చిందని చెప్పుకొచ్చాడు. అటు మహేష్ నటించిన సర్కారు వారి పాట రేపు (మే12) భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

Next Story