Mahesh Babu Daughter Sitara: నాన్న కూచీ.. నాన్నకు పోటీ.. 'సితార' వెండి తెర ఎంట్రీ..

Mahesh Babu Daughter Sitara: స్టార్ హీరోల చిన్నారులు తెరపై కనిపిస్తే అభిమానులకు అదో ఆనందం.. వారికున్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని చిన్నారులకు అవకాశం కల్పిస్తారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు 'శాకుంతలం' సినిమా ద్వారా వెండి తెర ఎంట్రీ ఇచ్చింది.
అటు తమిళంలో కూడా నటి మీనా కూతురు నైనిక చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తాజాగా సూపర్ స్టార్ కూతురు సితార కూడా తెరంగేట్రం చేయనుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో సితార కనిపించనుంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే విజయ్ బీస్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తరువాత వంశీ చిత్రంలో జాయినవుతారు.
వంశీ, దిల్ రాజు, విజయ్‌లతో మహేష్‌కి ఉన్న అనుబంధం కారణంగా.. అడగ్గానే ఒప్పుకున్నారట సితార సినిమాలో నటించేందుకు నమ్రత, మహేష్‌లు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com