Mahesh Babu : బాలయ్య అన్‌స్టాపబుల్.. మహేష్ ఎమోషనల్..!
Mahesh Babu : 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అంటూ ఆహా ఓటీటీలో హోస్ట్‌గా ఆదరగోడుతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఇప్పటివరకు ఆయన చేసిన ఎపిసోడ్ లకి అత్యధిక వ్యూస్‌తో పాటుగా మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇప్పుడీ ఈ షో ఫైనల్‌కి చేరింది. గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతిధిగా వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మహేష్‌తో పాటుగా టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా విచ్చేశారు.
గ్రాండ్ ఫినాలేలో బాలయ్య, మహేశ్‌ల మధ్య సాగిన సంభాషణఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చిన్నారుల హార్ట్ ఆపరేషన్ లపైన మహేష్ స్పందించాడు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కేవలం అరచేయి అంత ఉన్నాడని, తనకు డబ్బు ఉండటం వల్ల వైద్యం చేయించుకున్నామని, లేని వాళ్ల పరిస్థితి ఏంటనిపించిందని అన్నారు మహేష్. అందుకే చిన్నారుల హార్ట్ ఆపరేషన్ కోసం తన వంతు సాయం చేస్తున్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తుండగా ఫుల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com