Keerthy Suresh: కీర్తి సురేశ్‌పై ట్రోల్స్.. మహేశ్ బాబుకు కరెక్ట్ జోడీ కాదంటూ..

Keerthy Suresh: నటీనటులు కెరీర్ ప్రారంభమయినప్పుడు ఎన్ని హిట్లు కొట్టారు అనేదానికంటే ఆ హిట్లతో వచ్చిన క్రేజ్‌ను ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేదే ముఖ్యం. అలా నిలబెట్టుకోలేకే చాలామంది నటీనటుల కెరీర్ ఫేడవుట్ అయిపోయింది. వారు తీసుకునే నిర్ణయాలపై కూడా వారి కెరీర్ ఎంతకాలం సక్సెస్‌ఫుల్‌గా సాగుతుంది అనేది ఆధారపడుతుంది. తాజాగా కీర్తి సురేశ్ కెరీర్‌పై కూడా అలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి.
కీర్తి కెరీర్ 'నేను శైలజా' సినిమాతో తెలుగులో ప్రారంభమయ్యింది. ఆ తర్వాత 'మహానటి' సినిమాను తనను ఆకాశంలో తీసుకెళ్లి నిలబెట్టింది. కీర్తి సురేశ్ అనగానే మహానటి అని గుర్తొచ్చేలా చేసింది ఆ సినిమా. అయితే మహానటి తర్వాత కీర్తికి ఏ భాషలోనూ హిట్ అందలేదు. దాదాపు తాను నటించిన అరడజను సినిమాలు ఫ్లాప్‌గానే నిలిచాయి.
ఇటీవల విడుదలయిన 'గుడ్ లక్ సఖి' సినిమా అయితే మినిమమ్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. అయితే అప్పటినుండి మహేశ్ ఫ్యాన్స్‌కు భయం మొదలయ్యింది. కీర్తి సురేశ్‌ను ఒక్కసారిగా ఐరెన్ లెగ్ అనుకోవడం మొదలుపెట్టారు. అందుకే తన అప్‌కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట' సక్సెస్‌పై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.
అంతే కాకుండా సర్కారు వారి పాట మే లో విడుదలకు సిద్ధమవుతుండగా కీర్తి సురేశ్ తాజాగా ఓ మ్యూజిక్ వీడియోలో నటించింది. 'గాంధారి' అనే పేరుతో విడుదలయిన ఈ మ్యూజిక్ వీడియోకు పాజిటివ్ రెస్పాన్స్‌కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మహేశ్‌లాంటి స్టార్‌తో నటిస్తున్న సమయంలో ఇలాంటి మ్యూజిక్ వీడియో చేయడమేంటి అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com