Mahesh Babu: సీనియర్ ఎన్‌టీఆర్, కృష్ణ మధ్య గొడవ ఏంటి..? దీనిపై మహేశ్ స్పందన..

Mahesh Babu: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ఇప్పటివరకు ఎంత పెద్ద సక్సెస్‌ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. ఈ షోలో సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తుండడంతో అందులో వచ్చే సెలబ్రిటీలు కూడా తమ జీవితంలో ప్రేక్షకులకు తెలియని చాలా విషయాలను బయటపెట్టడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా మహేశ్ బాబు కూడా కృష్ణ, ఎన్‌టీఆర్ మధ్య వైరం గురించి బయటపెట్టారు.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో సీజన్ 1 పూర్తి చేసుకుంది. ఈ సీజన్‌కు గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్‌లో ఏకంగా మహేశ్ బాబును గెస్ట్‌గా తీసుకొచ్చారు మేకర్స్. ఈ ఎపిసోడ్ శుక్రవారం ఆహాలో స్ట్రీమ్ అయ్యింది. ఇందులో బాలయ్య, మహేశ్ మధ్య జరిగిన సంభాషణలు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తాయి. కెరీర్ గురించి, పర్సనల్ విషయాల గురించి కూడా మహేశ్ ఇంట్రెస్టింగ్ జవాబులు ఇచ్చారు.
సీనియర్ ఎన్‌టీఆర్, కృష్ణ మధ్య వైరం ఉందని ఎప్పటినుండో టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని పరిశ్రమలో గుసగుసలు వినిపించాయి. ఇదే విషయాన్ని అన్‌స్టాపబుల్ షోలో మహేశ్‌ను అడిగారు బాలయ్య. దీనిపై మహేశ్ కూడా ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు.
అల్లూరి సీతారామరాజు సమయంలో కృష్ణ, సీనియర్ ఎన్‌టీఆర్ మధ్య గొడవలు ఉన్నాయన్న మాట అబద్ధమని మహేశ్ స్పష్టం చేశారు. ఆ సినిమా చూసిన తర్వాత.. ఎన్‌టీఆర్, కృష్ణను చాలా అభినందించారని కృష్ణ తరుచూ గుర్తుచేసుకునేవారని మహేశ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com