Mahesh Babu : 'పవన్ కళ్యాణ్ వాటే పెర్ఫార్మెన్స్'.. భీమ్లానాయక్ పై మహేష్ బాబు
Mahesh Babu On Bheemla Nayak : భీమ్లానాయక్ మూవీ సక్సెస్ కావడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భీమ్లానాయక్ సినిమాని చూసి సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు.
వాటే పెర్ఫార్మెన్స్ అంటూ పవన్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. అటు డేనియల్ శేఖర్ గా రానా స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ అంటూ ట్వీట్ చేశాడు మహేశ్.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. "భీమ్లా నాయక్ పాత్రలో నిప్పులు చెరిగే తీవ్రతతో, ఎగిసే జ్వాలలా పవన్ కల్యాణ్ కనిపిస్తే... డేనియల్ శేఖర్‌గా రానా సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తెరపై అద్భుతంగా నటించారు. ఎప్పట్లాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుంచి పదునైన డైలాగులు వచ్చాయి. ఇటీవల కాలంలో త్రివిక్రమ్‌కు ఇదే అత్యుత్తమం అని చెప్పాలి. నాకు నచ్చిన సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన రవి కె చంద్రన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. తమన్ సంగీతం మనల్ని వెన్నాడుతుంది, మంత్రముగ్ధుల్ని చేస్తుంది.. యావత్ చిత్రబృందానికి అభినందనలు" అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
కాగా పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా మెయిన్ లీడ్‌లో తెరకెక్కిన భీమ్లానాయక్ వరల్డ్ వైడ్‌గా నిన్న(ఫిబ్రవరి 25)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు.
#BheemlaNayak is riveting, intense and electrifying! @PawanKalyan is in blazing form 🔥🔥🔥 what a performance!! @RanaDaggubati is sensational as 'Daniel Sekhar'.. what a screen presence!! 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com