Mahesh Babu : 50 సెకన్ల యాడ్ కోసం మహేష్ భారీ రెమ్యునరేషన్..!

Mahesh Babu : భయం వదులు.. గెలిచి చూడు అంటూ ఇటీవల మౌంటెన్ డ్యూ యాడ్‌లో కనిపించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో ఈ యాడ్‌ను చిత్రీకరించారు. ఖలీఫా నుంచి కిందకు బైక్ రైడ్ చేస్తూ మహేష్ కనిపిస్తారు.. అయితే ఈ యాడ్ కోసం మహేష్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగులో ఏడాది పాటు మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్‌ను ప్రమోట్ చేసేందుకు మహేష్ ఏకంగా రూ. 12 కోట్ల పారితోషికం తీసుకున్నారని ఫిల్మ్ నగర్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. గతేడాది కూడా మహేష్ సదరు బ్రాండ్‌ని ప్రమోట్ చేశారు. అయితే దానికి గాను ఆయన రూ. 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని, ఇప్పుడు అదనంగా మరో రూ. 5 కోట్లు ఎక్కువగా తీసుకున్నట్లు సమాచారం.
ఈ సారి యాడ్‌లో నటించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆ వాణిజ్య ప్రకటనను, మౌంటెన్ డ్యూ కంపెనీకి సంబంధించిన బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారు మహేష్ .. అందుకే రెమ్యునరేషన్‌ని కాస్త పెంచినట్టుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ యాడ్‌కి మంచి పేరొచ్చింది.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు.. తుదిదశకి చేరుకున్న ఈ సినిమాని మేలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు మహేష్.
On top of the world! Watch as Dew and I start an epic adventure together! @MountainDewIn#BhayamVoduluGelichiChudu #DarrKeAageJeetHai pic.twitter.com/Cqfe8xQhQh
— Mahesh Babu (@urstrulyMahesh) February 4, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com