Major: టికెట్ కోసం క్యూలో 'మహేష్ బాబు'.. 'మేజర్' ప్రాంక్ వీడియో అదిరిందిగా

Major: టికెట్ కోసం క్యూలో మహేష్ బాబు.. మేజర్ ప్రాంక్ వీడియో అదిరిందిగా
Major: అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ జూన్ 3, 2022న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది.

Major: అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ జూన్ 3, 2022న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. తాజాగా మేకర్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేజర్ నిర్మాతలలో ఒకరైన మహేష్ బాబు, అడివి శేష్‌తో కలిసి ఒక ప్రత్యేకమైన ఫన్నీ వీడియోను చేసి సినిమాను ప్రమోట్ చేసాడు. సర్కారు వారి పాటను కూడా ప్రమోట్ చేసిన ప్రముఖ యూట్యూబర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఈ వీడియోను రూపొందించారు.

శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, రేవతి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మేజర్ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

2008 ముంబై దాడుల సమయంలో కొంతమంది టెర్రరిస్టుల నుండి ప్రజలను కాపాడుతూ తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోను యూట్యూబర్ నిహారిక పోస్ట్ చేసింది. ఆమె కూడా అందులో కనిపించింది. మేజర్ యొక్క స్పెషల్ షో కోసం టిక్కెట్ల కోసం క్యూలో ఆమె చేరడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఒకరిద్దరు వ్యక్తులు క్యూలోకి రావడంతో ఆమె ఒక్కసారిగా చిరాకుపడింది.

వారిలో అడివి శేష్ ఒకరు. అతడు ఓ స్టార్ హీరో అని తెలియక అతనితో గొడవ పడుతుంది. మరొక వ్యక్తి కూడా క్యూలో నిలబడతాడు. అతడితో కూడా పోట్లాడుతుంది.. మధ్యలో వచ్చి ఎలా నిలుచుంటారు అని.

కానీ ఆమె క్యూలో నిలబడిన మహేష్ బాబుని చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె అతడిని గుర్తించి కోరుకున్న చోట నిలబడమని అభ్యర్థిస్తుంది. ఇదే ఛాన్స్ అని మహేష్ బాబు తన స్నేహితులను కూడా పిలిచి క్యూలో నిలబడమంటాడు. దాంతో నిహారిక షాక్ అవుతుంది.

నిహారిక ఇంతకుముందు సర్కారు వారి పాట ప్రచార కార్యక్రమాలలో కూడా మహేష్ బాబుతో కలిసి పనిచేసింది. మేజర్ చిత్రం కోసం పని చేసిన ఈ ప్రాంక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story