సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌ వచ్చేసింది

సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌ వచ్చేసింది
HBD Mahesh Babu: సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు బర్త్‌డే రోజు అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు.

HBD Mahesh Babu: సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు బర్త్‌డే రోజు అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న 'సర్కారువారి పాట' నుంచి స్పెషల్‌ వీడియో రిలీజ్ చేశారు. ఆగస్టు 9న 'సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌' (Sarkaru Vaari Paata)పేరుతో ఈ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో మహేశ్‌ మరింత యంగ్‌గా‌ కనిపించారు. మహేశ్ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, కీర్తిసురేశ్‌తో లవ్‌ ట్రాక్‌ హైలెట్ గా నిలిచింది.

బ్లాస్టర్‌ వీడియో విషయానికి వస్తే.. ఈ వీడియోలో రౌడీలతో మహేశ్‌ చెప్పే డైలాగ్‌లు ఈలలు వేయించేలా ఉన్నాయి. మహేశ్ బాబు 'ఇఫ్‌ యూ మిస్‌ ది ఇంట్రస్ట్‌ యు విల్‌ గెట్‌ ది డేట్‌' అంటూ విలన్ గ్యాంగ్ తో చెప్పే డైలాగ్స్ పేలిపోతున్నాయి. ఇక మహేశ్ని ఉద్దేశించి కీర్తి సురేశ్ చెప్పే డైలాగ్ ఓ రేంజ్ లో ఉంది. 'సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి' అంటూ కీర్తి చెప్పే డైలాగ్‌, మహేశ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌.. వావ్‌ అనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న 'సర్కారువారి పాట' విడుదల కానుంది.

ఇక 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మహేశ్‌ బాబు నటిస్తున్న 'సర్కారువారి పాట' మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 'సర్కారువారి పాట' పవర్‌ఫుల్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై ఈ మూవీ రూపొందుతుంది. ఎస్.ఎస్ తమన్‌ బాణీలు కట్టారు. పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Tags

Read MoreRead Less
Next Story