Mahesh Babu : మహేష్ బాబు సిఎమ్ సినిమా మళ్లీ వస్తోంది

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇప్పుడప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి. అంటే అంత కాలం పాటు తమ అభిమాన హీరోను థియేటర్ లో చూడకుండా ఉండాల్సిన పరిస్థితి. ఒకప్పుడైతే ఏమో కానీ.. ఇప్పుడా గొడవ లేదు. ఎందుకంటే పాత సినిమాలను మళ్లీ విడుదల చేసుకోవచ్చు. ఆ ట్రెండ్ ఇప్పుడు బాగా ఉంది కాబట్టి సూపర్ స్టార్ నటించిన సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ ఫ్యాన్స్ హ్యాపీస్ అవుతున్నారు.
త్వరలోనే మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భరత్ అనే నేను చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 26న ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. భరత్ అనే నేనుతోనే కియారా అద్వానీ తెలుగు తెరకు పరిచయం అయింది. మహేష్ సరసన కియారా మంచి జోడీ అనిపించకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఎమ్ గా ఉన్న తన తండ్రి అనుకోని పరిస్థితుల్లో చనిపోతాడు. దీంతో ఆయన స్థానంలో కొడుకును కూర్చోబెడతాడు పార్టీ పెద్ద. ఇలా చిన్న వయసులోనే ఏ రాజకీయానుభవం లేకుండానే సిఎమ్ అయిన మహేష్ బాబును దించడానికి సొంత పార్టీ వాళ్లతో పాటు అపోజిషన్ వాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి తోడు అతను తెచ్చిన సంస్కరణలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతాయి. తను ఏం చేసినా ‘అంతఃకరణ శుద్ధి’తో చేస్తుంటాడు. అది నచ్చని వాళ్లు సిఎమ్ నే చంపాలని చూస్తారు. మరోవైపు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిన హీరోయిన్ తో ప్రేమాయణం.. ఈ క్రమంలో సాగే సీన్స్..
పూర్తిగా కొరటాల మార్క్ సినిమాగా వచ్చిన భరత్ అనేనేను అప్పట్లో బ్లాక్ బస్టర్. మరి ఈ రీ రిలీజ్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com