Mahesh Babu : కమిటీ కుర్రోళ్లు.. మహేష్ బాబుకు నచ్చారు

Mahesh Babu  : కమిటీ కుర్రోళ్లు.. మహేష్ బాబుకు నచ్చారు
X

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏదైనా సినిమా నచ్చితే వెంటనే అప్రిసియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంటారు. కొన్నిసార్లు ఆయన సజెస్ట్ చేసే సినిమాలు చిత్రంగా ఉంటాయి కూడా. అలాంటి సినిమాలు ఎలా నచ్చాయా అనిపించిన సందర్భాలూ లేకపోలేదు. అయితే ఇలాంటివి ఎక్కువగా ఆయనకున్న పరిచయాల కారణంగా జరుగుతుంటాయి. రీసెంట్ గా తమిళ్ మూవీ రాయన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అతనికి కమిటీ కుర్రోళ్లూ నచ్చారట.

యధు వంశీ డైరెక్షన్ లో కొణెదల నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. అలాగని ఇందులో డబుల్ మీనింగ్స్ లేవు. అశ్లీలం కనిపించదు. చాలామందికి వారి బాల్యాన్ని గుర్తు చేస్తుంది. కొన్ని చోట్ల నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుంది. అందుకే యంగ్ స్టర్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అలాగే గోదావరి జిల్లాల ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి సినిమా తనకూ నచ్చిందని చెబుతూ మహేష్ బాబు తన 'ఎక్స్' ( ట్విట్టర్ ) లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. మరి మహేష్ చేసిన ట్వీట్ కమిటీ కుర్రోళ్లకు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి

Tags

Next Story