SSMB29 : మహేశ్.. రాజమౌళి సినిమా జనవరి నుంచి

మహేశ్‌బాబు కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29గా ఇది ప్రచారంలో ఉంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మక స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించే సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ గురించి మాట్లాడారు. ‘మాస్టర్ క్లాస్ బై మిస్టర్ విజయేంద్ర ప్రసాద్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జనవరి నుంచి మహేశ్ రాజమౌళి మూవీ షూట్ ప్రారంభం కానుందని చెప్పారు. ఈ కథ రాయడానికి అన్ దాదాపు రెండేళ్లు టైమ్ పట్టిందన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రియులు, ముఖ్యంగా మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com