Mahesh Babu : మహేష్ బాబు హీరోయిన్ గా స్పీచ్ లెస్ బ్యూటీ

Mahesh Babu :  మహేష్ బాబు హీరోయిన్ గా స్పీచ్ లెస్ బ్యూటీ
X

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ ‘అప్డేట్’ఏదైనా ఉంటే.. అది మహేష్ బాబు, రాజమౌళి మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మాత్రమే. అప్పుడెప్పుడో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్యూరియాసిటీ ఏదైతే దేశం మొత్తాన్ని ఊపేసిందో.. ఇప్పుడు టాలీవుడ్ అంతా ఈ కాంబినేషన్ లో సినిమా మొదలయ్యేది ఎప్పుడు అంటోంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. జక్కన్న మాత్రం ప్రస్తుతం లొకేషన్స్ వెదుకుతున్నాడు. హాలీవుడ్ రేంజ్ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ మూవీ కోసం అమెజాన్ ఫారెస్ట్ నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ వరకూ తిరుగుతూ షూటింగ్ కు అనుకూలంగా ఉండే ప్రాంతాలు వెదుకుతున్నాడు.

ఇక ఈమూవీలో మహేష్ బాబుతో పాటు నటించేది ఎవరు అనే ప్రశ్నలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఫీమేల్ లీడ్ ఎవరు అనేది చాలామంది సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక పేర్లు వినిపించాయి. లేటెస్ట్ గా మరో పేరు వినిపిస్తోంది. అయితే ఈ సారి కేవలం వినిపించడమే కాదు.. ఆల్మోస్ట్ తనే ఫిక్స్ అంటున్నారు. ఇంతకీ తనెవరూ అంటే.. బ్రిటీష్ బ్యూటీ నవోమీ స్కాట్. టివి షోస్ ద్వారా నటనలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మల్టీ టాలెంటెడ్. మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. అంతకు మించి గొప్ప సింగర్ గా అదరగొట్టింది. 2011లోనే పాటలు మొదలుపెట్టిన ఈ భామ 2019లో చేసిన ‘స్పీచ్ లెస్’అనే ఆల్బమ్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయింది. ఈ ఆల్బమ్ తర్వాత తనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులయ్యారు. అలాంటి బ్యూటీతో మహేష్ బాబు మాంచి అడ్వెంచర్స్ చేస్తే అది కూడా రాజమౌళి స్టైల్లో ఉంటే ఇంక ఈ మూవీ గ్లోబ్ ను ఊపేయడం గ్యారెంటీ అంటున్నారు అభిమానులు.

కాకపోతే ఇది అఫీషియల్ న్యూస్ కాదు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకూ వచ్చిన వార్తల్లాగానే ఊహాగానమే. బట్ ఈ ఊహ నిజమే అనేది స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. అయినా మహేష్ లాంటి కటౌట్ సరసన ఎలాంటి బ్యూటీ అయినా తేలిపోవల్సిందే కదా.. అందుకే ముందు అసలు ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెబితే బెటర్ కదా..?

Tags

Next Story