Mahesh Babu Review : ఆమిర్ ఖాన్ సినిమాకి మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu Review :  ఆమిర్ ఖాన్ సినిమాకి మహేష్ బాబు రివ్యూ
X

Genelia D'Souzaమనసుకు నచ్చిన సినిమాల గురించి వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మహేష్ బాబుకు ఎప్పటి నుంచో అలవాటు ఉంది. ఇంతకు ముందు మహేష్ చెప్పిన రివ్యూస్ వల్ల చాలా సినిమాలకు ప్లస్ అయింది. కలెక్షన్స్ పెరిగాయి. అలాగని అతనెప్పుడూ మొహమాటానికి ఫేక్ రివ్యూస్ చెప్పలేదు. సినిమాలే కాదు.. వెబ్ సిరీస్ ల గురించి కూడా షేర్ చేస్తుంటాడు. అలా అతనికి తాజాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘సితారే జమీన పర్’తెగ నచ్చిందట. అందుకే చూసిన వెంటనే తన ఎక్స్ ఖాతాలో రివ్యూ పెట్టేశాడు. రివ్యూ అంటే రెగ్యులర్ గా కాదు.. తనదైన సినిమాలో సినిమా చాలా బావుందని చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు.

‘ఆమిర్ ఖాన్ అన్ని సినిమాల్లాగానే ఇదీ ఓ అద్భుతమైన క్లాసిక్ సినిమా. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టేలా చేస్తుంది. బయటకు వస్తున్నప్పుడు మీ మొహాల్లో మంచి నవ్వులు ఉంటాయి... ’అంటూ మహేష్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. నిజానికి ఆమిర్ ట్రాక్ తప్పి చాలా రోజులవుతోంది. దీంతో ఈ మూవీకి చాలా తక్కువ బజ్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ఏమంత గొప్పగా లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఆమిర్ పని ఐపోయింది అన్నవాళ్లూ లేకపోలేదు. అలాంటి మూవీ సడెన్ గా రైజ్ అయింది. మంచి మౌత్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ మూడు రోజుల్లో డీసెంట్ వసూళ్లు కనిపిస్తున్నాయి.

మరోవైపు బాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలేం లేకపోవడం కూడా కలిసొచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు రివ్యూతో తెలుగు స్టేట్స్ లో కూడా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడా తెలుగులోనూ అందుబాటులో ఉంది. మల్టీ ప్లెక్సెస్ లో హిందీలో ఉంది. మరి మహేష్ బాబు రివ్యూ సితారే జమీన్ పర్ కు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.

Tags

Next Story