Mahesh Babu: నాటు నాటు పాట గురించి మహేశ్ బాబు స్పెషల్ ట్వీట్..

Mahesh Babu: టాలీవుడ్‌లో ఏ సినిమా విడుదలయినా.. మిగతా హీరోలు చాలావరకు దానిని చూసి వారి రివ్యూను అందిస్తూ ఉంటారు. అందులోనూ అది పాన్ ఇండియా సినిమా అయితే వెంటనే చూసేస్తారు. ఈ శుక్రవారం విడుదలయిన 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కాబట్టి వారంతా ఈ చిత్రాన్ని చూసి వారి రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు కూడా ఆర్ఆర్ఆర్‌పై తన అభిప్రాయాన్ని చెప్పాడు.
There are films and then there are SS Rajamouli films! #RRR E.P.I.C!! The scale, grandeur visuals, music & emotions are unimaginable, breathtaking and simply stunning!
— Mahesh Babu (@urstrulyMahesh) March 26, 2022
'సినిమాలు ఉంటాయి కానీ అందులో రాజమౌళి సినిమాలు వేరు. ఆర్ఆర్ఆర్ ఎపిక్. ఆ విజువల్స్, సంగీతం, ఎమోషన్స్ ఊహాతీతంగా, ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్‌లాంటి ప్రాజెక్ట్ చేసినందుకు మొత్తం టీమ్‌కు హ్యాట్సాఫ్. చాలా గర్వంగా ఉంది.' అని టీమ్‌కు అభినందనలు తెలిపాడు మహేశ్. అంతే కాకుండా నాటు నాటు పాటకు స్పెషల్‌గా ఓ ట్వీట్ చేశాడు.
Hats off to the entire team of #RRR for executing this mammoth project!! So so proud! Congratulations 🎉🎉🎉@aliaa08 @ajaydevgn @OliviaMorris891 @thondankani @mmkeeravaani @DOPSenthilKumar
— Mahesh Babu (@urstrulyMahesh) March 26, 2022
'ఎన్‌టీఆర్, రామ్ చరణ్.. వారి స్టార్‌డమ్‌కు అతీతంగా ఎదిగి ఇలాంటి పర్ఫార్మెన్స్‌ను చేశారు. భూ ఆకర్షణ శక్తి అనేది నాటు నాటు పాటలో లేదనుకుంటా. వారిద్దరి గాలిలోనే డ్యాన్స్ చేశారు' అన్నాడు మహేశ్. సినిమాలో కొన్ని సన్నివేశాలు తమను తాము మరిచిపోయేలా చేస్తాయని, అలా చేయడం కేవలం ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ ద్వారానే సాధ్యం అవుతుందని రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తాడు మహేశ్.
@tarak9999 and @AlwaysRamCharan grow beyond their stardom and come out with performances which are out of this world!! The law of gravity didn't seem to exist in the Natu-Natu song! They were literally flying!! 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) March 26, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com