Mahesh Babu: శ్రీరామనవమికి మహేశ్ బాబు విషెస్.. సితార స్పెషల్ వీడియో షేర్ చేస్తూ..

Mahesh Babu: శ్రీరామనవమి సందర్భంగా తమ ఫ్యాన్స్‌కు నటీనటులు స్పెషల్ విషెస్‌ను తెలియజేస్తున్నారు. అలాగే వర్క్‌లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో సమయాన్ని గడిపే ఫ్యామిలీ మ్యాన్ మహేశ్ బాబు కూడా ఫ్యాన్స్‌ను స్పెషల్‌గా విష్ చేశారు. కానీ ఈ విషెస్‌లో మరొక స్పెషాలిటీ కూడా ఉంది. మహేశ్.. శ్రీరామనవమి విషెస్ చెప్పడంతో పాటు సితారకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను కూడా షేర్ చేశారు.
మహేశ్ కూతురు సితారపై ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఫోకస్ పెరిగింది. మహేశ్ తన ఫ్యామిలీతో ఎక్కువగా హాలిడేస్‌కు వెళ్తుంటాడు కాబట్టి కేవలం ఆ ఫోటోల్లోనే సితార కనిపిస్తూ ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియాలో సితారకు సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే పలు డ్యాన్స్ వీడియోలతో తన ఫాలోవర్స్‌ను ఎప్పటికప్పుడు అలరించే ప్రయత్నం చేస్తోంది సితార.
మామూలుగా సినిమా పాటలకు డ్యాన్స్ చేయడంతో పాటు సితార.. కూచిపూడి కూడా నేర్చుకుంటుందట. శ్రీరామనవమి సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టడంతో పాటు సితార కూచిపూడి డ్యాన్స్ వీడియోను కూడా షేర్ చేశాడు మహేశ్. 'సితార పాప డెడికేషన్ చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఎప్పటికప్పుడు నన్ను ఇంకా గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తూనే ఉంటావు.' అంటూ సితార వీడియోతో పాటు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపాడు మహేశ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com